వార్తలు

అమ్మ నుడి గురించి

అమ్మనుడి (పత్రిక)

అమ్మనుడి తెనాలి నుండి ప్రచురితమైతున్న మాసపత్రిక. తెలుగు జాతి ప్రతిక ఉపపేరుతో నుడి-నాడు-నెనరు ఉపశీర్షికతో ఈ పత్రిక వెలువడుతుంది. 2013 అక్టోబరు ప్రచురితమైన నుడుస్తున్న చరిత్ర పత్రిక ఆర్థిక కారణాలవలన ఆగిపోయి, తిరిగి 2015 మార్చి నుండి సరికొత్త పేరుతో ప్రారంభమైంది. [1] అంతర్జాలంలో తెలుగు భాషపై చర్చలు జరుగుతుండడానికి అమ్మనుడి పత్రికలో వచ్చిన వ్యాసాలే కారణం 1983 నుండి 2013 వరకు నడుస్తున్న చరిత్ర పత్రికను విజయవాడ కేంద్రంగా డా. సామల రమేష్ బాబు ప్రచురించారు. 2001 నుండి రాజకీయ విశ్లేషణలతోపాటుగా భాషా ఉద్యమాల గురించి వ్యాసాలు రావడం ప్రారంభమై, 2009 నాటికి పూర్తిస్థాయి భాషోద్యమ పత్రికగా రూపాంతరం చెందింది. ఆర్థిక కారణాల వల్ల 2013 నవంబరు నుండి ఈ పత్రిక వెలువడలేదు. తిరిగి 2015 ఉగాదికి (మార్చి) తొలి సంచికతో పేరు మార్చుకొని అమ్మనుడిగా వెలువడింది. తెలుగు భాషను ద్రావిడ భాషగా గుర్తిస్తూ అచ్చతెలుగు మూలాలను సంస్కృతంలేని పదాలనుండి స్వీకరించాలని ఈ పత్రికలో రాసే రచయితల ప్రధాన దృష్టికోణం. సంపాదకుడు: డా. సామల రమేష్ బాబు

తోడ్పాటు: డా. గారపాటి ఉమామహేశ్వరరావు, డా. వెన్నిసెట్టి సింగారావు, డా. సుందర్ కొంపల్లి, రహ్మానుద్దీన్ షేక్, సరస్వతుల రామనంసింహం (సరసి), తమ్మా శ్రీనివాసరెడ్డి.


అమ్మనుడి

ప్రజలందరూ ఎవరి మాతృభాషలో వారు ఎంతవరకైనా (అంటే పసి చదువుల నుండి పట్టా చదువుల వరకూ) చదువుకోగలగాలి, కోరుకున్నంత సౌకర్యవంతమైన జీనవం సాగించగలగాలి. అందుకు మొదటి మెట్టు మాతృభాషలో విద్యా బోధన. మాతృభాషలో సమాచారం అందుబాటు, అమ్మనుడిలో రోజువారీ వ్యవహారాల జరుగుబాటు అనేవి మలిమెట్లు.

© ammanudi.org.in. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి. Designed and Developed by eBhashasetu